Andhra Pradesh: దొంగబ్బాయి జగన్, 420 తాతయ్య సాయిరెడ్డి జైలుకెళ్లడం ఖాయం!: బుద్ధా వెంకన్న

  • చిదంబరం అరెస్టుపై రగడ
  • దుమ్మెత్తిపోసుకుంటున్న వైసీపీ-టీడీపీ
  • వైఎస్ పై విమర్శలు చేసిన బుద్ధా వెంకన్న
కాంగ్రెస్ నేత చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్ చేయడంపై తెలుగుదేశం-వైసీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. చంద్రబాబు పాద మహిమ కారణంగానే చిదంబరం అరెస్ట్ అయ్యారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఈరోజు విమర్శించారు. దీంతో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను టీడీపీ నేత బుద్ధా వెంకన్న తిప్పికొట్టారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఏపీ సీఎం జగన్ లపై విమర్శలు గుప్పించారు.

దిగమింగే నేత(వైఎస్ రాజశేఖరరెడ్డి) చరిత్ర రాష్ట్రం దాటి జాతీయ స్థాయికి చేరిందని బుద్ధా వెంకన్న విమర్శించారు. తాచెడ్డ కోతి వనమంతా చెరిచినట్టు, ఆయనతో కూర్చున్న వారంతా జైలుకెళ్లడం యాదృచ్ఛికం కాదని వ్యాఖ్యానించారు. అంతా దేవుడు రాసిన స్క్రిప్ట్ మహిమేనని ఎద్దేవా చేశారు. దొంగ పత్రిక, ఛానల్ నడిపే దొంగబ్బాయి జగన్, 420 తాతయ్య విజయసాయిరెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. వీరిద్దరిని జైలు రావాలి.. కావాలి అంటోందని ఎద్దేవా చేశారు. అందుకు సిద్ధంగా ఉండాలని బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.
Andhra Pradesh
YSRCP
Jagan
Vijay Sai Reddy
Telugudesam
Chandrababu
budha venkanna
budda venkanna

More Telugu News