Tollywood: మకుటంలేని మహారాజు, అన్నయ్య చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు!: గంటా శ్రీనివాసరావు

  • నేడు మెగాస్టార్ పుట్టినరోజు
  •  సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష 
  • ఫొటోను షేర్ చేసిన గంటా
నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం నేత గంటా శ్రీనివాసరావు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సినీ వినీలాకాశంలో చిరంజీవి మకుటంలేని మహారాజుగా ఎదిగారని గంటా ప్రశంసించారు. ఈరోజు ట్విట్టర్ లో ఆయన స్పందిస్తూ..‘సినీ వినీలాకాశంలో మకుటంలేని మగ మహారాజుగా ఎదిగి, అభిమానులకు ఆత్మీయతను పంచుతున్న మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో చిరంజీవిగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. గతంలో మెగాస్టార్ తో ఓ వేడుక సందర్భంగా దిగిన ఫొటోను గంటా షేర్ చేశారు.

Tollywood
Telugudesam
Chiranjeevi
mega star
Ganta Srinivasa Rao
Twitter
wished
DOB
Birthday

More Telugu News