Mamata Banerjee: రోడ్డు పక్కన దుకాణంలో చాయ్ వాలా అవతారమెత్తిన మమతా బెనర్జీ.. వీడియో చూడండి

  • ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్లి వస్తూ రోడ్డు పక్కనున్న టీ దుకాణానికి వెళ్లిన మమత
  • ఓ చిన్న పాపను ఎత్తుకుని ముద్దాడిన సీఎం
  • అక్కడున్న ప్రజలతో కాసేపు ముచ్చట్లు
పాలనా వ్యవహారాల్లో అనునిత్యం బిజీగా ఉండే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చాయ్ వాలా అవతారమెత్తారు. వివరాల్లోకి వెళ్తే, ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్లి వస్తూ దిఘాలోని దత్తాపూర్ లో ఉన్న ఓ చిన్న టీ దుకాణం వద్ద ఆమె ఆగారు. కారు దిగి దుకాణం వద్దకు వెళ్లిన ఆమె కాసేపు దుకాణదారుతో ముచ్చటించారు. ఓ చిన్న పాపను ఎత్తుకుని ముద్దాడారు. అనంతరం స్వయంగా టీ పెట్టి తన పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు. మమత నిరాడంబరతకు అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.

ఇంతలో మమత అక్కడ ఉన్నారనే వార్త తెలుసుకుని భారీ సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకున్నారు. దీంతో, పెద్ద ఎత్తున సెక్యూరిటీ కూడా అక్కడకు చేరుకుంది. అయితే, సెక్యూరిటీని దుకాణం వద్దకు రావద్దని చెప్పిన దీదీ... అక్కడున్న వారితో కాసేపు మాట్లాడారు. అనంతరం తిరుగుపయనమయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. చిన్నచిన్న ఆనందాలు జీవితాన్ని ఆనందమయం చేస్తాయని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

Mamata Banerjee
West Bengal
Tea

More Telugu News