Pawan Kalyan: చాలారోజుల తర్వాత పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లు

  • ఐదు నెలల తరువాత ట్వీట్లు
  • 'సైరా' విజయవంతం కావాలి
  • అమితాబ్ ను కలిసిన క్షణాలు మధురమన్న పవన్
దాదాపు ఐదు నెలల తరువాత జనసేన అధినేత పవన్ కల్యాణ్, తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు చేశారు. నేడు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉండగా, నిన్ననే హైదరాబాద్, శిల్పకళా వేదికలో జరిగిన సంబరాల్లో పాల్గొన్న ఆయన, ఆపై వరుస ట్వీట్లు పెట్టారు.

 'సైరా' సినిమా సందర్భంగా అమితాబ్ ను కలిసిన వేళ, తీసిన చిత్రాలను పోస్ట్ చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒరిజినల్ ఫోటోను కూడా చూపించారు. నిన్నటి నుంచి నరసింహారెడ్డి గురించి, ఆయన ఘనతల గురించి ఇంటర్నెట్ మొత్తం మారుమోగి పోతోందని అన్నారు. భారత చరిత్ర అంటే కేవలం ఢిల్లీ చరిత్ర కాదని, చరిత్ర మరచిన ఎందరో వీరులున్నారని అంటూ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. తన జీవితంలోని మధురమైన క్షణాల్లో అమితాబ్ బచ్చన్ ను కలిసిన సమయం ఎంతో అద్భుతమైనదని అన్నారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
Pawan Kalyan
Sairaa
Chiranjeevi
Amitabh Bachchan
Twitter

More Telugu News