Hyderabad: దుబాయ్‌లో అదృశ్యమైన హైదరాబాద్ యువకుడు

  • ఎనిమిదినెలలుగా దొరకని ఆచూకీ
  • విదేశాంగ శాఖ సాయం కోరిన తల్లిదండ్రులు
  • ఆచూకీ తెలుసుకోవాల్సిందిగా రాయబార కార్యాలయనికి ఆదేశాలు
దుబాయ్‌లోని ఎతిసలాత్‌లో పనిచేస్తున్న హైదరాబాద్ యువకుడు అబ్దుల్ వహాబ్ అదృశ్యమయ్యాడు. గత ఎనిమిది నెలలుగా తమ కుమారుడి ఆచూకీ తెలియరావడం లేదంటూ ఆయన తండ్రి మహమ్మద్ అబ్దుల్ ఘనీ కన్నీరు పెట్టుకున్నాడు. తన కుమారుడి ఆచూకీ చెప్పాల్సిందిగా విదేశీ మంత్రిత్వ శాఖ సాయాన్ని అర్థించాడు. గత ఎనిమిది నెలలుగా వహాబ్ నుంచి ఎటువంటి సమాచారం లేదని, తాము అతడిని సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని అబ్దుల్ ఘనీ పేర్కొన్నాడు. కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనగా ఉందన్నారు. ఎంబీటీ నేత అమ్జదుల్లాఖాన్ సాయంతో విదేశాంగ శాఖకు సోషల్ మీడియా ద్వారా చేసిన అభ్యర్థనకు ఆ శాఖ స్పందించింది. వహాబ్ ఆచూకీ తెలుసుకోవాల్సిందిగా దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని ఆదేశించింది.
Hyderabad
Dubai
Telangana

More Telugu News