Krishna District: గన్నవరం విమానాశ్రయంలోకి వర్షపు నీరు!

  • దెబ్బతిన్న విమానాశ్రయ కార్యాలయం పైభాగం
  • వీఐపీల విశ్రాంతి హాలు, సిబ్బంది గదుల్లోకి చేరిన నీరు
  • నీటిని బయటకు పంపిస్తున్న సిబ్బంది
కృష్ణా జిల్లా గన్నవరంలో ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో, గన్నవరం విమానాశ్రయంలోకి కూడా వర్షపు నీరు ప్రవేశించింది. విమానాశ్రయ కార్యాలయం పైభాగం దెబ్బతినడంతో గదుల్లోకి వర్షపు నీరు చేరింది. వీఐపీల విశ్రాంతి హాలు, సిబ్బంది గదుల్లోకి చేరిన నీటిని బయటకు పంపిస్తున్నారు. వర్షపు నీరు చేరిన గదులను విమానాశ్రయం డైరెక్టర్ మధుసూదన్ రావు పరిశీలించారు.
Krishna District
Gannavaram
Airport
Rain

More Telugu News