Andhra Pradesh: రాజధాని అమరావతిపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారు: మంత్రి అవంతి శ్రీనివాస్

  • బొత్స ఆయన పరిధిలోని విషయాలు చెప్పారు
  • రాజధానిని మారుస్తామని ఆయన ఎక్కడా చెప్పలేదు
  • ప్రస్తుతం రాజధాని అంశం అప్రస్తుతం
ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై మరో మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. బొత్స ఆయన పరిధిలోని విషయాలు చెప్పారని, రాజధానిని మారుస్తామని ఆయన ఎక్కడా చెప్పలేదని అన్నారు. రాజధానిపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. వరదల కారణంగా ప్రజలు ఇబ్బందిపడుతున్న సమయంలో రాజధాని అంశం అప్రస్తుతమని అన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, మళ్లీ కొత్త సమస్యలు సృష్టించుకోవడం మంచిది కాదని సూచించారు. ఐదేళ్లలో తాత్కాలిక సెక్రటేరియట్, అసెంబ్లీ తప్ప టీడీపీ కట్టిందేంటి? తాము ఆపిందేంటి? అని ప్రశ్నించారు.
Andhra Pradesh
Amaravathi
Minister
Avanthi

More Telugu News