Amaravathi: వచ్చే ఎన్నికలతో ఏపీలో జగన్ చాప్టర్ క్లోజ్: టీడీపీ నేత వేదవ్యాస్

  • అనుభవంలేని పాలన కారణంగా ఏపీ అధోగతి పాలైంది
  • అమరావతిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు బాధాకరం
  • రాజధానిగా అమరావతి ఉండటం ప్రభుత్వానికి ఇష్టం లేదు
రాజధాని అమరావతి నిర్మాణం జరగకూడదని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని టీడీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమరావతిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు బాధాకరమని, రాజధానిగా అమరావతి ఉండటం ప్రభుత్వానికి ఇష్టం లేదని అన్నారు. వరదలను భూతద్దంలో చూపి రాజధాని నిర్మాణం ఆపాలనుకుంటున్నారని, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ఉన్న ప్రాంతాలేవీ మునగలేదని అన్నారు. జగన్ మనుషులు భూములు కొన్నందున రాజధానిని దొనకొండకి మర్చాలనుకుంటున్నారని, వచ్చే ఎన్నికలతో ఏపీలో జగన్ చాప్టర్ క్లోజ్ అని, అనుభవంలేని పాలన కారణంగా ఏపీ అధోగతి పాలైందని విమర్శించారు.
Amaravathi
Jagan
cm
Telugudesam
vedavyas

More Telugu News