Amaravathi: రాజధానిపై బొత్స వ్యాఖ్యలను సమర్థించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి

  • నదీ పరీవాహక ప్రాంతాల్లో రాజధాని నిర్మిస్తే అదనపు భారం పడుతుంది
  • చదరపు అడుగుకు బాబు రూ.12 వేలు కేటాయించారు
  • లోతట్టు ప్రాంతాల్లో కాకుండా అనువైన ప్రదేశాల్లో రాజధాని నిర్మించాలి
రాజధాని అమరావతిపై త్వరలో ఓ కీలక ప్రకటన చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే టీడీపీ నేతలు మండిపడుతుండగా, వైసీపీ నేతలు మాత్రం 'రాజధాని మారుస్తామని చెప్పలేదుగా’ అని అంటున్నారు. తాజాగా, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ, బొత్స చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో రాజధాని నిర్మిస్తే అదనపు భారం పడుతుందని అన్నారు. చదరపు అడుగుకు చంద్రబాబు రూ.12 వేలు కేటాయించారని, రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. లోతట్టు ప్రాంతాల్లో కాకుండా అనువైన ప్రదేశాల్లో రాజధానిని నిర్మించాలని అభిప్రాయపడ్డారు.
Amaravathi
Chandrababu
Telugudesam
YSRCP
RK

More Telugu News