Jagan: యూఎస్ లో జ్యోతి ప్రజ్వలన చేయడానికి జగన్ నిరాకరణ... విమర్శిస్తూ వీడియోను పోస్ట్ చేసిన సీఎం రమేశ్!

  • ప్రస్తుతం అమెరికా పర్యటనలో జగన్
  • దీపాన్ని వెలిగించేందుకు నిరాసక్తత
  • జగన్ నటిస్తున్నారని సీఎం రమేశ్ విమర్శలు
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఓ కార్యక్రమంలో జ్యోతిని వెలిగించి, సభను ప్రారంభించాలని నిర్వాహకులు కోరిన వేళ నిరాకరించారట. జ్యోతిని వెలిగించేందుకు నిరాసక్తతను చూపారట. ఇందుకు సంబంధించిన వీడియోను తెలుగుదేశం నుంచి బీజేపీలోకి ఫిరాయించిన సీఎం రమేశ్, తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. "వైసీపీ అధ్యక్షుడు జగన్ గారు అమెరికాలో ఒక కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడానికి నిరాకరించడం ఖచ్చితంగా హిందువులను అవమానించడమే. ఎన్నికల సమయంలో హిందువుల ఓట్ల కోసమే ఆయన దేవాలయాల చుట్టూ తిరుగుతూ నటించారని అర్థం అవుతుంది" అని ఆయన కామెంట్ పెట్టారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.
Jagan
CM Ramesh
USA
Lamp

More Telugu News