Amitabh Bachchan: తన ఆరోగ్యం గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన అమితాబ్ బచ్చన్

  • 25 శాతం కాలేయంతోనే జీవిస్తున్నానన్న అమితాబ్
  • సకాలంలో వైద్యపరీక్షలు చేయించుకోకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని వెల్లడి
  • తన లాగా మరొకరు బాధపడకూడదంటూ వ్యాఖ్యలు
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన ఆరోగ్యం గురించి సంచలన విషయాలు వెల్లడించారు. 'స్వస్థ్ ఇండియా' అనే కార్యక్రమంలో పాల్గొన్న అమితాబ్ తాను 25 శాతం కాలేయంతోనే జీవిస్తున్నానని తెలిపారు. చెడు రక్తం కారణంగా తన కాలేయం 75 శాతం మేర దెబ్బతిన్నదని, సకాలంలో వైద్యపరీక్షలు చేయించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురైందని అన్నారు. గతంలో  తాను టీబీ, హెపటైటిస్-బి వ్యాధులతో బాధపడ్డానని, ప్రచారం కోసం తాను ఇలా చెప్పుకోవడంలేదని, తనలాగా మరొకరు బాధపడకూడదనే ఈ విషయం చెబుతున్నానని తెలిపారు. సుమారు ఎనిమిదేళ్లు జబ్బేంటో తెలియకుండా బాధలు పడ్డానని, వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే నివారణ సులభమని అభిప్రాయపడ్డారు.
Amitabh Bachchan
Health

More Telugu News