Allu Arjun: 'అల వైకుంఠపురం'లో బన్నీ ద్విపాత్రాభినయం?

  • త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ మూడో సినిమా 
  • కీలకమైన పాత్రలో 'టబు' 
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు  
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా చేస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాకి ఇటీవలే 'అల వైకుంఠపురంలో' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడనేది తాజా సమాచారం. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా .. గ్రామీణ యువకుడిగా రెండు విభిన్నమైన పాత్రలను ఆయన పోషిస్తున్నట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.

సాఫ్ట్ వేర్ ఉద్యోగి పాత్ర సరసన సహ ఉద్యోగినిగా పూజా హెగ్డే కనిపిస్తుందని అంటున్నారు. ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ ఒక రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. టబు కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాలో, నివేదా పేతురాజ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో నిర్మితమవుతోన్న ఈ మూడో సినిమాతో హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనే నమ్మకంతో అభిమానులు వున్నారు.
Allu Arjun
Pooja hegde
Tabu

More Telugu News