Chandrababu: రేపు గుంటూరు జిల్లా డెల్టా ప్రాంతంలో చంద్రబాబు పర్యటన

  • కృష్ణా నదికి వరదలు
  • ఇవాళ కృష్ణా జిల్లా వరద బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
  • రేపు గుంటూరు జిల్లా వేమూరు, రేపల్లె, తెనాలి నియోజకవర్గాల్లో పర్యటన
కృష్ణా నది వరదల నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటిస్తూ వరద బాధితులను పరామర్శిస్తున్నారు. చంద్రబాబు రేపు గుంటూరు జిల్లా డెల్టా ప్రాంతంలో పర్యటించనున్నారు. వేమూరు, రేపల్లె, తెనాలి నియోజకవర్గాల్లో వరద బాధితుల వద్దకు వెళ్లనున్నారు. కాగా, ఈ మధ్యాహ్నం కృష్ణా జిల్లాలోని యనమలకుదురు, పెదపులిపాక, కాసరనేనిపాలెంలో పర్యటించిన చంద్రబాబు నీట మునిగిన ఇళ్లు, పంట పొలాలను పరిశీలించారు. వరద బాధితులకు ధైర్యం చెప్పారు.
Chandrababu
Guntur District

More Telugu News