KCR: కేసీఆర్ కు మరోసారి కృతజ్ఞతలు తెలిపిన గుత్తా సుఖేందర్ రెడ్డి

  • ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా గుత్తా ఎన్నిక
  • ఏకగ్రీవంగా గెలిచినట్టు ప్రకటించిన రిటర్నింగ్ అధికారి
  • ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి ఆనందాన్ని పంచుకున్న గుత్తా
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నికైన సంగతి తెలిసిందే. నిన్నటితో ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో గుత్తా ఒక్కరే నిలిచారు. దాంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. తన ఎన్నిక పట్ల సంతోషం వ్యక్తం చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి ఇవాళ సీఎం కేసీఆర్ ను కలిసి మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ పదవికి తన పేరును ప్రకటించడం పట్ల ఆయన కొన్నిరోజుల క్రితం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు చెప్పారు. తాజాగా, ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టు ప్రకటన విడుదలైన నేపథ్యంలో ప్రగతి భవన్ లో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి తన ఆనందాన్ని పంచుకున్నారు.
KCR
MLC
Gutta Sukhendar Reddy
Telangana

More Telugu News