Andhra Pradesh: సీఎం ఇంట్లో ఒకాయన కూర్చొని నా ఇంటిపైకి డ్రోన్ పంపారు: చంద్రబాబు

  • ఇవి కృత్రిమంగా వచ్చిన వరదలు 
  • జలాశయాలు నింపే ప్రయత్నం చేయలేదు
  • డ్రోన్ ద్వారా ఫొటోలు తీయడమే కాదు, బాంబులూ పంపొచ్చు
సీఎం ఇంట్లో ఒకాయన కూర్చొని తన ఇంటిపైకి డ్రోన్ పంపారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. కృష్ణా నది వరదముంపు ప్రాంతాల్లో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇవి కృత్రిమంగా వచ్చిన వరదలు అని, జలాశయాలు నింపే ప్రయత్నం చేయకుండా నీటిని ఇళ్ల పైకి వదిలారని, డ్రోన్ ద్వారా ఫొటోలు తీయడమే కాదు, బాంబులు కూడా పంపొచ్చు అని వ్యాఖ్యానించారు. ముంపు ప్రాంతాల్లో మంచినీళ్లుకూడా సరఫరా చేయలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులు తన ఇంటిచుట్టూ తిరిగారే తప్ప ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదని, రాష్ట్రంలో ఇసుక దొరకదు, అన్న క్యాంటీన్ తెరవరని మండిపడ్డారు.
Andhra Pradesh
Telugudesam
Chandrababu
Vijayawada

More Telugu News