Aravind: నిజామాబాద్ పేరు మార్చాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు: బీజేపీ ఎంపీ అరవింద్

  • నిజామాబాద్ పేరును 'ఇందూర్' గా మార్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారన్న ఎంపీ
  • ప్రజల మనోభావాలు 'ఇందూర్' అనే పేరుతో ముడిపడి ఉన్నాయని వివరణ
  • 'ఇందూర్' అనే పేరు హిందు, ఇండియాలకు దగ్గరగా ఉందంటూ భాష్యం
నిజామాబాద్ యువ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ పేరు మార్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. నిజామాబాద్ పేరును 'ఇందూర్' గా మార్చాలని ప్రజలు కోరుకుంటున్నట్టు వెల్లడించారు. తాము ఉంటున్న ప్రాంతం నిజామాబాద్ అనే పేరుతో కొనసాగడంలో ఔచిత్యం కనిపించడంలేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారని, ప్రజల మనోభావాలు 'ఇందూర్' అనే పేరుతో ముడిపడి ఉన్నాయని అరవింద్ పేర్కొన్నారు. 'ఇందూర్' అనేది ఎంతో శుభప్రదమైన పేరుగా భావిస్తున్నారని, పైగా 'ఇందూర్' అనే పేరు 'హిందు', 'ఇండియా' పేర్లకు దగ్గరగా ఉందని ఆయన వివరించారు.
Aravind
Nizamabad District
BJP

More Telugu News