Tarun: నేను ఇంట్లోనే ఉన్నా... కారులో ఎక్కడికీ వెళ్లలేదు బాబోయ్: 'కారు ప్రమాదం' వార్తలపై తరుణ్ స్పందన

  • గత రాత్రి ఔటర్ రింగ్ రోడ్ పై ప్రమాదం
  • కారులో తరుణ్ ఉన్నట్టు మీడియాలో వార్తలు
  • తాను కాదని స్పష్టం చేసిన తరుణ్
గత రాత్రి ఔటర్ రింగ్ రోడ్డ్ పై తన కారు ప్రమాదానికి గురైందని, ప్రాణాలతో బయటపడ్డ తాను మరో కారులో వెళ్లిపోయానంటూ పలు చానెళ్లలో ప్రసారమవుతున్న వార్తలపై హీరో తరుణ్ స్పందించాడు. అల్కాపురి వద్ద డివైడర్ ఢీకొట్టిన కారుకు, తనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశాడు. ఈ ఉదయం తనను కలిసిన మీడియాతో మాట్లాడిన తరుణ్, తాను రాత్రంతా ఇంట్లోనే ఉన్నానని, ఎక్కడికీ వెళ్లలేదని చెప్పాడు. మీడియాలో వచ్చిన వార్తలను చూసి, తన క్షేమసమాచార నిమిత్తం వందల మంది ఫోన్ చేస్తున్నారని చెప్పాడు. తాను క్షేమంగా ఉన్నానని, ప్రమాదం జరిగిన కారు తనది కాదని అన్నాడు.
Tarun
Accident
Car
ORR

More Telugu News