Srisailam: శ్రీశైలం దేవస్థానం దుకాణాల వేలం రద్దుకు మంత్రి వెల్లంపల్లి ఆదేశం

  • దేవాదాయ శాఖ కమిషనర్ కు మంత్రి ఆదేశాలు
  • వేలం పాట రద్దుకు తగు చర్యలు తక్షణమే చేపట్టాలి
  • పూర్తి వివరాలు అందగానే తదుపరి చర్యలు చేపడతాం
శ్రీశైల దేవస్థానం, లలితాంబిక వాణిజ్య సముదాయంలోని దుకాణాలకు ఇటీవల నిర్వహించిన వేలంపాటపై ఆరోపణలు తలెత్తిన నేపథ్యంలో దీనిపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. దుకాణాల వేలం పాట రద్దుకు తగిన చర్యలు తక్షణమే చేపట్టాలని దేవాదాయ శాఖ కమిషనర్ కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై పూర్తి వివరాలు అందిన అనంతరం తదుపరి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అవినీతి లేని పారదర్శక పరిపాలనే ప్రభుత్వ లక్ష్యం అని, దేవాలయాలలో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. శ్రీశైల దేవస్థానం పరిరక్షణ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు.
Srisailam
Devastanam
tenders
Vellampalli

More Telugu News