Telugudesam: టీడీపీ, కొన్ని మీడియా సంస్థలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయి: మంత్రి అనిల్ కుమార్ యాదవ్

  • కృష్ణా నదిలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది
  • అందరూ సమన్వయంతో పనిచేశారు
  • వరద పరిస్థితిపై టీడీపీవి దిగజారుడు రాజకీయాలు
కృష్ణా నదిలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోందని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వరద ప్రభావంపై సీఎం జగన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సమన్వయంతో పనిచేశారని చెప్పారు. వరద పరిస్థితిపై టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, టీడీపీ, కొన్ని మీడియా సంస్థలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.
Telugudesam
YSRCP
Media organistions
minister
Anil

More Telugu News