మూసుకుంటున్న శ్రీశైలం రిజర్వాయర్ గేట్లు
- క్రమంగా తగ్గుతున్న వరద
- ఐదు గేట్లను మూసివేసిన అధికారులు
- రేపు సాగర్ గేట్ల మూసివేతకు అవకాశం
ఎగువ నుంచి రెండున్నర లక్షల క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తున్న కారణంగా గేట్లను మూసివేసినట్టు తెలిపారు. వస్తున్న నీటిలో కొంతభాగాన్ని రిజర్వాయర్ ను నింపేందుకు, ఇతర కాలువలు, ఎత్తిపోతల పథకాల ద్వారా తరలింపునకు వాడుతున్నామని పేర్కొన్నారు. కాగా, 885 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉండే రిజర్వాయర్ లో ప్రస్తుతం 882.70 అడుగుల నీరు నిల్వ ఉంది. ఇది 202.96 టీఎంసీలకు సమానం. ఇదిలావుండగా, సాగర్ నుంచి వచ్చే నీటిని బట్టి, గేట్ల మూసివేతపై నేటి సాయంత్రం లేదా రేపు అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.