Sairaa: 'సైరా'కు రజనీకాంత్, మోహన్ లాల్ తమవంతు సహకారం!

  • తెలుగులో పవర్ స్టార్ వాయిస్ ఓవర్
  • తమిళంలో రజనీకాంత్, కన్నడలో యష్ వాయిస్ ఓవర్
  • మలయాళ వర్షన్ కు మోహన్ లాల్ సాయం
చిరంజీవి తాజా చిత్రం 'సైరా'కు దక్షిణాది సినీ ప్రముఖులు తమవంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం అన్ని దక్షిణాది భాషల్లోనూ విడుదల అవుతుందన్న సంగతి తెలిసిందే. తెలుగులో వాయిస్ ఓవర్ ను పవన్ కల్యాణ్ అందించగా, తమిళంలో రజనీకాంత్, మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో యష్ లు వాయిస్ ఓవర్ అందించారని తెలుస్తోంది. ఇక హిందీలో ఈ పని ఎవరు చేశారన్న విషయం ఇంకా వెల్లడి కాలేదు.

రజనీకాంత్, మోహన్ లాల్ ప్రవేశంతో 'సైరా'కు ఆయా భాషల్లో మంచి హైప్ లభిస్తుందనడంలో సందేహం లేదు. రామ్ చరణ్ నిర్మాతగా రూపొందిన ఈ సినిమా వచ్చేనెల 2వ తేదీన విడుదల కానుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో పాటు నయనతార, కిచ్చ సుదీప్, జగపతిబాబు, విజయ్ సేతుపతి తదితర ఎందరో ప్రముఖులు ముఖ్య పాత్రలను పోషించారు.
Sairaa
Chiranjeevi
Rajanikant
Mohan Laal
Pawan Kalyan
Voice Over

More Telugu News