kollywood: కోలీవుడ్ బిగ్ బాస్... హౌస్ లో నటి మధుమిత ఆత్మహత్యాయత్నంతో తీవ్ర కలకలం!

  • 'ఒరుకల్‌ ఒరు కన్నాడి' చిత్రంతో వెలుగులోకి వచ్చిన మధుమిత
  • కెప్టెన్ బాధ్యతలు మోస్తూ తీవ్ర ఒత్తిడి
  • ఆత్మహత్యాయత్నంతో బయటకు పంపివేత
కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తమిళ బిగ్‌ బాస్‌ హౌస్‌ లో నటి మధుమిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. 'ఒరుకల్‌ ఒరు కన్నాడి' చిత్రంలోని తన నటనతో నవ్వులు పూయించి పేరు తెచ్చుకున్న మధుమిత, సీజన్‌ 3లో పోటీదారుగా ఉంది. ఇప్పటికే 50 రోజులకు పైగా హౌస్ లో ఉన్న ఆమె, కెప్టెన్‌ బాధ్యతలను నిర్వహిస్తూ, ఒత్తిడిని తట్టుకోలేక ఈ పని చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆమెను హౌస్ నుంచి వెంటనే బయటకు పంపించేశారు. బయటకు వచ్చిన ఆమె, ఇంట్లోని వారంతా తనను వేధించారని, అందువల్లే చనిపోవాలని అనిపించిందని వ్యాఖ్యానించడం గమనార్హం. కమల్ వ్యాఖ్యాతగా ఉన్న గత రెండు సీజన్లలోనూ పలు వివాదాస్పద ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే.
kollywood
Biggboss
Madhumitha
Sucide Attempt

More Telugu News