Hyderabad: బీజేపీ కండువా కప్పుకునే సమయంలో కన్నీళ్లు పెట్టుకున్న గరికపాటి!

  • నడ్డా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్న గరికపాటి
  • పార్టీ కోసం పని చేసిన వారికి టికెట్లు ఇచ్చుకోలేని స్థితిలో టీడీపీ ఉంది
  • పదవుల కోసం నేను బీజేపీలో చేరలేదు
హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈరోజు సాయంత్రం బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీడీపీని వీడి బీజేపీలో చేరుతున్నట్టు గరికపాటి మోహన్ రావు ఇటీవల ప్రకటించారు. అయితే, నడ్డా సమక్షంలో ఈరోజు బీజేపీ కండువాను ఆయన కప్పుకున్నారు. బీజేపీలో చేరే సమయంలో గరికపాటి కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ, పార్టీ కోసం పని చేసిన వారికి టికెట్లు ఇచ్చుకోలేని స్థితిలో టీడీపీ ఉందని, తాను పదవుల కోసం బీజేపీలో చేరలేదని చెప్పారు. తన వెంట బీజేపీలో చేరిన టీడీపీ నాయకులకు న్యాయం చేయాలని కోరారు.
Hyderabad
Bjp
Nadda
Garikapati

More Telugu News