Chittoor District: సెప్టెంబరు 2 నుంచి కాణిపాకం వినాయకుడి బ్రహ్మోత్సవాలు

  • 21 రోజులు జరగనున్న బ్రహ్మోత్సవాలు
  • బ్రహ్మోత్సవాల పోస్టర్ విడుదల
  • భక్తులకు తగు ఏర్పాట్లు చేయాలి: మంత్రి వెల్లంపల్లి ఆదేశాలు
చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కాణిపాకం దేవస్థానం ఈవో పూర్ణచందర్రావు అందజేశారు. అనంతరం బ్రహ్మోత్సవాల పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు. వినాయకచవితి మొదలుకుని 21 రోజులపాటు వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పారు. ఈ బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు, యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు ఏర్పాట్లు చేయాలని వెల్లంపల్లి  ఆదేశించారు.
Chittoor District
Kanipakam
varasidhi
vinayaka

More Telugu News