మరో రెండు వారాల్లో... కొత్త పేరుతో అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం!
- గత నెల 31న మూతపడిన క్యాంటీన్లు
- తిరిగి ప్రారంభించేందుకు సిద్ధం కండి
- అక్షయపాత్ర అధికారులకు ఆదేశాలు
వీటి మూసివేత తరువాత ప్రజల నుంచి నిరసన వ్యక్తం కాగా, పునరాలోచనలో పడిన ప్రభుత్వం తిరిగి వీటిని తెరిపించాలని నిర్ణయించుకుంది. అక్టోబర్ 2 నుంచి క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ అధికారులకు, అక్షయపాత్ర ప్రతినిధులకు ఆదేశాలు అందాయి. ఇక అన్ని పాత క్యాంటీన్లనూ తిరిగి ప్రారంభిస్తారా? లేక కొన్ని మూసివేస్తారా? అన్న విషయమై స్పష్టత రావాల్సివుంది.