Anna Canteen: మరో రెండు వారాల్లో... కొత్త పేరుతో అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం!

  • గత నెల 31న మూతపడిన క్యాంటీన్లు
  • తిరిగి ప్రారంభించేందుకు సిద్ధం కండి
  • అక్షయపాత్ర అధికారులకు ఆదేశాలు
పేదలకు రూ. 5కే భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు కొత్త పేరుతో వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. భోజనం సరఫరా చేసే అక్షయపాత్ర ప్రతినిధులకు ఈ మేరకు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందింది. గత నెల 31న అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసివేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, ముఖ్యమైన పట్టణాల్లో అన్న క్యాంటీన్లను టీడీపీ సర్కారు ఏర్పాటు చేసిందన్న సంగతి విదితమే.

వీటి మూసివేత తరువాత ప్రజల నుంచి నిరసన వ్యక్తం కాగా, పునరాలోచనలో పడిన ప్రభుత్వం తిరిగి వీటిని తెరిపించాలని నిర్ణయించుకుంది. అక్టోబర్ 2 నుంచి క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ అధికారులకు, అక్షయపాత్ర ప్రతినిధులకు ఆదేశాలు అందాయి. ఇక అన్ని పాత క్యాంటీన్లనూ తిరిగి ప్రారంభిస్తారా? లేక కొన్ని మూసివేస్తారా? అన్న విషయమై స్పష్టత రావాల్సివుంది.
Anna Canteen
Andhra Pradesh
Akshayapatra

More Telugu News