Indonesia: జకార్తా నుంచి కాళీమంథన్ కు ఇండొనేషియా రాజధాని మార్పు... సంచలన ప్రకటన చేసిన అధ్యక్షుడు!

  • బోర్నియా ద్వీపంలో ఉన్న కాళీమంథన్
  • తరచూ ప్రకృతి విపత్తులతో జకార్తాకు ముప్పు
  • ప్రజల ఇబ్బందులను తొలగించడానికేనన్న విడోడో
ఇండోనేషియా రాజధానిని జకార్తా నుంచి బోర్నియో ద్వీపంలో ఉన్న కాళీమంథన్ నగరానికి మార్చనున్నట్టు దేశాధ్యక్షుడు జోకో విడోడో సంచలన ప్రకటన చేశారు. దేశంలో భూకంపాలు, సునామీలు తరచుగా వస్తుండటం, పలు అగ్ని పర్వతాలు పేలడానికి సిద్ధంగా ఉండటంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించిన విడోడో, జకార్తాపై ప్రకృతి విపత్తుల ప్రభావం అధికంగా ఉండటంతో రాజధానిని మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు పార్లమెంట్ లో ప్రకటించాడు.  

బోర్నియో ద్వీపంలోని కాళీమంథన్ కు రాజధానిని తరలించే ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం జకార్తా నగరం 25 సెంటీమీటర్ల చొప్పున సముద్రంలో మునిగిపోతున్నదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే.. 2050 నాటికి నగరంలో మూడింట ఒక వంతు నీటి పాలవుతుందని హెచ్చరించారు. ఈలోగానే తగు జాగ్రత్తలు తీసుకుని, రాజధానిని కాళీమంథన్ కు మార్చబోతున్నట్టు అయన తెలిపారు.
Indonesia
Jakartha
Kalimandhan
Capital

More Telugu News