క్రమంగా శాంతిస్తున్న కృష్ణమ్మ... ప్రకాశం బ్యారేజ్ వద్ద తగ్గిన వరద!
- వారం రోజులుగా ఉగ్రరూపం
- మూడు రోజుల క్రితం 9 లక్షల క్యూసెక్కుల వరద
- ప్రస్తుతం ఆరున్నర లక్షల క్యూసెక్కులలోపే
ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ లో 12 అడుగుల మేరకు నీరు ఉందని, ఇది 3.07 టీఎంసీలకు సమానమని తెలిపారు. డెల్టాలకు 17 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని అన్నారు. ముంపు ప్రాంతాల్లో సైతం వరద తగ్గిందని, ప్రస్తుతం యూఎస్ పర్యటనలో ఉన్న సీఎం వైఎస్ జగన్, ఎప్పటికప్పుడు వరద ప్రభావాన్ని సమీక్షించారని వెల్లడించారు.