ఖైరతాబాద్ మెట్రో పిల్లర్ వద్ద నాగర్ కర్నూలు వాసి దారుణ హత్య!
- ఈరోజు తెల్లవారుజామున ఘటన
- హత్య చేసి పరారైన దుండగులు
- నిందితుల కోసం పోలీసుల గాలింపు
ఈ విషయమై పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. మృతుడి పేరు బంగారి(55) అని తెలిపారు. ఈయన స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం జీలుగుపల్లి గ్రామమని చెప్పారు. ఈ హత్య చేసేందుకు గల కారణం ఇంకా తెలియరాలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.