ఎంత చిల్లర తీసుకుంటే అంత నగదు డిపాజిట్: బ్యాంకులకు తేల్చి చెప్పిన టీటీడీ
- నానాటికీ పెరిగిపోతున్న చిల్లర నాణాలు
- నగదు డిపాజిట్లపై ఆంక్షలు విధించిన టీటీడీ
- చిల్లర తీసుకొనేందుకు ముందుకొచ్చిన రెండు బ్యాంకులు
ఈ విషయాన్ని స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డి తెలిపారు. హుండీల నుంచి చిల్లరను పరకామణిలో వేరుచేసి లెక్కించే బాధ్యతలను కూడా ఆ బ్యాంకులే తీసుకోవాలని ఆయన అన్నారు. కాగా, టీటీడీ ఇచ్చిన ఆఫర్ కు ఇప్పటికే తిరుమలలో వివిధ రకాల సేవల్లో నిమగ్నమైన విజయా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో దాదాపు మూడు సంవత్సరాల నుంచి టీటీడీ అధికారులను వేధిస్తున్న చిల్లర సమస్యకు ఓ పరిష్కారం లభించినట్లయింది.