రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలు దురదృష్టకరం: పాకిస్థాన్
తొలుత అణ్వాయుధాలను ప్రయోగించకూడదనేని భారత్ సిద్ధాంతమని... అయితే, పరిస్థితులను బట్టి తమ నిర్ణయం మారుతుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ స్పందించింది. రాజ్ నాథ్ వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యంగా ఉన్నాయని... దురదృష్టకరమైనవని పాక్ విదేశాంగశాఖ ఓ ప్రకటన వెలువరించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపింది. అణ్వాయుధాల ప్రయోగం విషయంలో పాకిస్థాన్ ఎంతో నిగ్రహంతో వ్యవహరిస్తోందని... ఇకపై కూడా అలాగే ఉంటుందని చెప్పారు.