Chandrababu: చంద్రబాబు ఇంటి గురించి మేం చూసుకుంటాం, మీరు వరద బాధితులను చూసుకోండి: వర్ల రామయ్య

  • కృష్ణా నదికి వరదల నేపథ్యంలో చర్చనీయాంశంగా చంద్రబాబు నివాసం
  • ప్రభుత్వం, మంత్రుల దృష్టంతా చంద్రబాబు ఇంటిమీదేనంటూ వర్ల ఫైర్
  • వరద బాధితులకు సాయంపై దృష్టి పెట్టాలంటూ ఏపీ సీఎంకు హితవు
కృష్ణా నది వరదనీటితో పోటెత్తుతున్న నేపథ్యంలో, రాజధాని అమరావతి ప్రాంతంలోని మాజీ సీఎం చంద్రబాబు నివాసం కూడా మునిగిపోయే ప్రమాదముందని, అందుకని వెంటనే ఖాళీ చేయాలని ఇప్పటికే ఆ నివాసానికి ప్రభుత్వం నోటీసులు పంపింది. దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య ప్రభుత్వానికి చురక అంటించారు.

చంద్రబాబు ఇంటి గురించి తాము చూసుకుంటామని, ముందు వరద బాధితుల గురించి ప్రభుత్వం పట్టించుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం, మంత్రులు చంద్రబాబు ఇంటిని ఖాళీ చేయించడం మీద చూపిస్తున్న శ్రద్ధ వరద బాధితులను ఆదుకోవడంపై పెట్టడంలేదని వర్ల రామయ్య ఆరోపించారు. అయ్యా ఏపీ సీఎం, చంద్రబాబు నివాసం మీద నుంచి దృష్టి మరల్చి, రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాలపై దృష్టి పెట్టండి అంటూ ట్వీట్ చేశారు.
Chandrababu
Jagan
Andhra Pradesh
Varla Ramaiah

More Telugu News