snake bite: పాము కాటేస్తే చీమ కుట్టిందనుకున్నారట!

  • కాటు గుర్తించిన కాసేపటికి తీవ్ర అస్వస్థత
  • హడావుడిగా ఆసుపత్రికి తరలింపు
  • అప్పటికే చేయిదాటి మార్గమధ్యంలోనే మృతి
అవగాహన లోపం, నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. పనిలో ఉండగా పాము కాటేస్తే చీమ కుట్టి ఉంటుందని భావించడంతో పరిస్థితి విషమించి బాధితుడు మృతి చెందాడు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మాల్యాల మండలం రాంపూర్‌ గ్రామంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలావున్నాయి.

గ్రామానికి చెందిన వల్లేపు శ్రీకాంత్‌ అనే వ్యక్తి దైనందిన వ్యవహారాల్లో మునిగి ఉండగా పాము కాటేసింది. ఏదో కరిచిందన్న విషయం అతను కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. చీమ కుట్టి ఉంటుందిలే అని వారు తేలికగా తీసిపారేశారు. అయితే కుట్టింది విషసర్పం కావడంతో కాసేపటికి శ్రీకాంత్‌ తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. అప్పుడుగాని కుటుంబ సభ్యులకు వాస్తవం తెలిసి రాలేదు. దీంతో అప్రమత్తమై హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే  పరిస్థితి విషమించడంతో మార్గమధ్యంలోనే బాధితుడు చనిపోయాడు.
snake bite
jagityala
one died

More Telugu News