చెవిటికల్లు పడవ ప్రమాదం .. గల్లంతైన బాలిక మృతదేహాన్ని కనుగొన్న ఎన్డీఆర్ఎఫ్!
- కృష్ణా జిల్లాలో నిన్న గల్లంతైన బాలిక
- రాత్రి నుంచి కొనసాగిన సహాయక చర్యలు
- విషాదంలో మునిగిపోయిన చెవిటికల్లు వాసులు
తండ్రి, సోదరి తులసి ప్రియతో కలిసి గౌతమిప్రియ నిన్న తమ అమ్మమ్మ వాళ్ల ఇంటికి నాటు పడవలో బయలుదేరింది. అయితే నది మధ్యలోకి రాగానే ప్రవాహం ధాటికి పడవ బోల్తా కొట్టింది. ఈ సందర్భంగా తండ్రి తులసిప్రియను కాపాడగలిగినా, గౌతమి ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీంతో రంగంలోకి దిగిన గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బాలిక కోసం గాలింపును ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఈరోజు బాలిక మృతదేహం లభ్యమైంది.