విశాఖలో టీడీపీ నేత పీలా గోవింద్ భవనాన్ని కూల్చి వేస్తున్న జీవీఎంసీ
- డ్రైన్‌ను ఆక్రమించి కట్టారని జీవీఎంసీ అధికారుల ఆరోపణ
- గతంలో పలుమార్లు నోటీసులు పంపామన్న అధికారులు
- కొనసాగుతున్న కూల్చివేత కార్యక్రమం
ఈ విషయంలో స్పందన కోరుతూ గతంలో పలుమార్లు గోవింద్‌కు నోటీసులు పంపినప్పటికీ స్పందన రాలేదని చెబుతున్నారు. దీంతో ఈ ఉదయం రంగంలోకి దిగిన జీవీఎంసీ సిబ్బంది.. అధికారుల సమక్షంలో కూల్చివేత మొదలుపెట్టారు. ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తుగా భారీగా మోహరించారు. ప్రస్తుతం కూల్చివేత కార్యక్రమం కొనసాగుతోంది.