Andhra Pradesh: వైసీపీ వందరోజుల పాలనపై అధ్యయనానికి ‘జనసేన’ బృందాలు

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో వైసీపీ వంద రోజుల పాలనపై అధ్యయనానికి జనసేన పార్టీ బృందాలు ఏర్పాటు చేసింది. గుంటూరులో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ బృందాలను నియమించారు. 30 మంది సభ్యులతో 10 బృందాలను ఏర్పాటు చేశారు. సెప్టెంబరు 3వ వారం నుంచి ఉత్తరాంధ్ర, రాయలసీమలో పార్లమెంట్ స్థాయీ సమావేశాలను నిర్వహించనున్నట్టు పవన్ తెలిపారు. ఆశావహ దృక్పథంతో ఉన్న కార్యకర్తల మనసులను గెలుచుకోవడానికి, నాయకులు కొంత ఓర్పుతో పని చేయాల్సిన అవసరం ఉందని పవన్ పేర్కొన్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
janasena
Pawan Kalyan

More Telugu News