Andhra Pradesh: సీఎం జగన్ ఇంటిపై కూడా డ్రోన్లు నడుపుతారా?: చంద్రబాబునాయుడు
- సీఎం ఇంటి నుంచి కిరణ్ అనే వ్యక్తి చెప్పడం వల్లే డ్రోన్ చక్కర్లు కొట్టింది
- ఈ విషయాన్ని పట్టుబడ్డవాళ్లే చెప్పారు
- అసలు, కిరణ్ అనే వ్యక్తి ఎవరు?
తన నివాసం వద్ద డ్రోన్ చక్కర్లు కొట్టడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు మాట్లాడుతూ, సీఎం జగన్ ఇంటిపై కూడా డ్రోన్లు నడుపుతారా? అని ప్రశ్నించారు. సీఎం ఇంటి నుంచి కిరణ్ అనే వ్యక్తి చెప్పడం వల్లే తన నివాసం వద్ద డ్రోన్ చక్కర్లు కొట్టిందన్న విషయాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వాళ్లే చెబుతున్నారని విమర్శించారు. అసలు, కిరణ్ అనే వ్యక్తి ఎవరు? అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, చిరుద్యోగులను వేధించి ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నారు' అంటూ ఆరోపణలు చేశారు.