Chandrababu: నాపై అక్కసుతో జనాన్ని వరదల్లో ముంచేస్తారా?: ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపాటు

  • వ్యక్తిపై ద్వేషంతో వరదలతో ఆటలాడతారా?
  • వరద నిర్వహణ చేస్తే నీళ్లు వెనక్కి వచ్చేవా?
  • గేట్లను ఆపరేట్ చేసే విధానం ఇలాగేనా?
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. టీడీపీ నేతలతో ఈరోజు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ, ‘నాపై అక్కసుతో జనాన్ని వరదల్లో ముంచేస్తారా? వ్యక్తిపై ద్వేషంతో వరదలతో ఆటలాడతారా? అని ప్రశ్నించారు. వరద ప్రవాహాల నియంత్రణలో, సక్రమంగా వరద నిర్వహణ చేస్తే నీళ్లు వెనక్కి వచ్చేవా? నీళ్లు వెనక్కి తన్నడం కోసం గేట్లకు బోట్లు అడ్డం పెడతారా? వరద నిర్వహణపై సీఎం జగన్ ఒక్క సమీక్ష అయినా చేశారా? గేట్లను ఆపరేట్ చేసే విధానం ఇలాగేనా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

 మన రాష్ట్రంలో వర్షాలు లేవు, పొరుగు రాష్ట్రాల్లో వర్షాలకు వచ్చిన వరదలివి అని, 3 లక్షల క్యూసెక్కులు ముందే వదిలితే ఈ సమస్య ఉండేదా? నీళ్లు నిల్వ ఉంచి అకస్మాత్తుగా విడుదల చేస్తారా? ముంపు బాధితులకు సహాయ చర్యలను పట్టించుకోరా? అని  ప్రశ్నించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు.
Chandrababu
Telugudesam
cm
Jagan
Andhra Pradesh

More Telugu News