Amit Shah: అమిత్ షాతో భేటీ అయిన సీఎం రమేశ్

  • దాదాపు గంట సేపు కొనసాగిన సమావేశం
  • ఏపీ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ
  • బీజేపీలో చేరికలపై కూడా చర్చలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు వీరి సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా ఏపీ తాజా రాజకీయ పరిస్థితులపై వీరు చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై వీరు లోతుగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరికలపై కూడా చర్చించారు. కాసేపట్లో మీడియా ముఖంగా చర్చల వివరాలను సీఎం రమేశ్ వివరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, తెలంగాణలో అమిత్ షా పర్యటన నేపథ్యంలో, వీరిరువురి సమావేశంపై కూడా ఆసక్తి నెలకొంది.
Amit Shah
CM Ramesh
BJP

More Telugu News