Andhra Pradesh: అక్రమాస్తుల కోటల్లో విలాసాల్లో మునిగేవారికి పేదల ఆకలిబాధలు ఏం తెలుస్తాయి?: నారా లోకేశ్

  • వైసీపీ నేతలపై నారా లోకేశ్ ఆగ్రహం
  • అన్న క్యాంటీన్లలో వీరికి అవినీతి కనిపించిందని విమర్శ
  • పేదల ఆకలి బాధలు వైసీపీకి పట్టదని వ్యాఖ్య
ఏపీ సీఎం జగన్, వైసీపీ నాయకులపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శల దాడి కొనసాగుతోంది. అన్న క్యాంటీన్లలో వైసీపీ నేతలకు పేదల సంతృప్తి కంటే అవినీతే కనిపించిందని లోకేశ్ దుయ్యబట్టారు. దీన్ని బట్టే వైసీపీ నేతల ఆలోచనలు ఎంత నీచంగా ఉన్నాయో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.

అక్రమాస్తులతో కట్టిన కోటల్లో, విలాసాల్లో మునిగితేలే వాళ్లకు పేదల ఆకలి బాధలు ఏం తెలుస్తాయని లోకేశ్ ప్రశ్నించారు. ఏదేమయినా అన్న క్యాంటీన్లను తిరిగి తెరవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Telugudesam
Nara Lokesh
Twitter
YSRCP
Anna canteen

More Telugu News