అనంతపురంలో టీడీపీ ఆందోళన.. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అరెస్ట్!
- అన్న క్యాంటీన్ల మూసివేతపై టీడీపీ ఆందోళన
- రాయదుర్గంలో ఆందోళన చేపట్టిన కాలవ
- అడ్డువచ్చిన టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ
వైసీపీ ప్రభుత్వం ఇలాంటి ప్రతీకార చర్యలకు దిగడం మంచిది కాదని హితవు పలికారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు కాలవ శ్రీనివాసులతో పాటు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. వీరిని స్టేషన్ కు తరలిస్తుండగా మిగిలిన టీడీపీ కార్యకర్తలు పోలీసు జీపులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వీరిపై లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. అనంతరం కాలవ శ్రీనివాసులు, టీడీపీ కార్యకర్తలను రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు తరలించారు.