Crime News: నిద్రిస్తున్న వ్యక్తి తలపై రాయితో మోది హత్య: కర్నూలు జిల్లాలో ఘటన

  • బాధితుడిది గడివేముల మండలం ఎల్కే తండా
  • ఈరోజు తెల్లవారు జామున దారుణం
  • గ్రామ శివారులో ఆవుల మంద వద్ద పడుకోవడానికి వెళ్లిన బాధితుడు
గ్రామ శివారులో ఉన్న ఆవుల మందకు కాపలాగా వెళ్లిన ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు నిద్రలో ఉండగా బండరాయితో తలపై మోది హత్యచేశారు. ఏపీలోని కర్నూలు జిల్లా గడివేముల మండలం ఎల్కే తండాలో ఈరోజు తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది.

స్థానికుల కథనం మేరకు...పాణ్యం మండలం పిన్నాపురం గ్రామానికి చెందిన కృష్ణ గత కొంతకాలంగా బతుకుదెరువు కోసం ఎల్కే తండాలో ఓ యజమాని వద్ద ఆవుల కాపరిగా ఉంటున్నాడు. నిన్న రాత్రి గ్రామ శివారులోని ఆవుల మంద వద్ద పడుకోవడానికి వెళ్లాడు. తెల్లవారు జామున కృష్ణను లేపేందుకు వెళ్లిన యజమానికి అతను రక్తపు మడుగులో పడివుండడం కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అర్ధరాత్రి తర్వాత కృష్ణను హత్య చేసి ఉండవచ్చునని భావిస్తున్నారు.
Crime News
Kurnool District
elke tanda
man murdered

More Telugu News