Supreme Court: అరగంట చదివినా ఏమీ అర్థం కాలేదు: 'ఆర్టికల్ 370' రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టు సీజే రంజన్ గొగోయ్

  • పిటిషన్ దాఖలు చేసిన ఎంఎల్ శర్మ
  • 370 రద్దుపై స్టే ఇవ్వాలని కోరిన పిటిషనర్
  • పిటిషన్ ఎందుకు వేశారో తెలియడం లేదన్న సీజే
జమ్మూకశ్మీర్ రాష్ట్ర పునర్విభజన, ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ ను ఈ ఉదయం విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. "నేను మీ పిటిషన్ ను అరగంటపాటు చదివాను. ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. మీరు ఈ పిటిషన్ ను ఎందుకు వేశారో తెలియడం లేదు" అని వ్యాఖ్యానించారు. కాగా, సీనియర్ న్యాయవాది ఎంఎల్ శర్మ, ఈ పిటిషన్ ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కశ్మీర్ ప్రజలకు వ్యతిరేకంగా, అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్రాన్ని రెండుగా విభజించారని, ఆర్టికల్ 370 రద్దుపై స్టే ఇవ్వాలని ఆయన కోరిన సంగతి తెలిసిందే.
Supreme Court
Ranjan Gogoi
Article 370

More Telugu News