Andhra Pradesh: ప్రతీకార రాజకీయాలు చాలు.. అన్న క్యాంటీన్లను తెరిపించండి!: జగన్ కు బుద్ధా వెంకన్న సలహా

  • అన్న క్యాంటీన్లను మూసివేసిన ప్రభుత్వం
  • విమర్శల దాడిని కొనసాగిస్తున్న టీడీపీ
  • ప్రభుత్వ చర్యపై ట్విట్టర్ లో మండిపడ్డ బుద్ధా వెంకన్న
అన్న క్యాంటీన్లను జగన్ ప్రభుత్వం పలుచోట్ల మూసివేయడంపై తెలుగుదేశం నేతలు విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. ఇప్పటివరకూ చేసిన ప్రతీకార రాజకీయాలను సీఎం జగన్ ఆపేయాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. అన్న క్యాంటీన్లను మళ్లీ వెంటనే తెరిపించాలని కోరారు.

ఈ మేరకు బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో స్పందించారు. అంతకుముందు చంద్రబాబు కూడా అన్న క్యాంటీన్ల మూసివేతతో లక్షలాది మంది కేవలం రూ.5కు భోజనం చేసే అవకాశాన్ని కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని కారణంగా 20,000 మంది ఉపాధి కోల్పోయారని మండిపడ్డారు. ప్రజలను ఎందుకు శిక్షిస్తున్నారని ప్రశ్నించారు.
Andhra Pradesh
Jagan
YSRCP
anna canteen
budha venkanna
Telugudesam
Chandrababu
Twitter

More Telugu News