Telangana: ప్రజల ఆరోగ్యం కంటే కాంట్రాక్టర్ల కమీషన్లే ముఖ్యమా?: తెలంగాణ సర్కారుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం

  • తెలంగాణలో నిలిచిన ఆరోగ్య శ్రీ సేవలు
  • బకాయిలు వెంటనే చెల్లించాలని రేవంత్ రెడ్డి డిమాండ్
  • ట్విట్టర్ లో స్పందించిన కాంగ్రెస్ నేత
తెలంగాణలోని పలు నెట్ వర్క్ ఆసుపత్రుల్లో నిన్నటి నుంచి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిచిపోవడంపై కాంగ్రెస్ నేత, లోక్ సభ సభ్యుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం కంటే కాంట్రాక్టర్ల కమీషన్లే ముఖ్యమా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

ఆరోగ్య శ్రీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన రేవంత్ రెడ్డి ఓ ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని తన ట్వీట్ కు జతచేశారు. అంతేకాకుండా తెలంగాణ సీఎం కార్యాలయంతో పాటు సదరు పత్రికను తన ట్వీట్ కు ట్యాగ్ చేశారు.
Telangana
Congress
Revanth Reddy
arogyasri
stopped
TRS
CMO

More Telugu News