హైదరాబాద్-శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైలు..రద్దీని తట్టుకునేందుకే!
- 17, 19 తేదీల్లో హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న రైలు
- తిరుగు ప్రయాణంలో 18, 20న శ్రీకాకుళం రోడ్ నుంచి
- సద్వినియోగం చేసుకోవాలన్న రైల్వే
తిరుగు ప్రయాణంలో 18, 20 తేదీల్లో రైలు (07025) శ్రీకాకుళం రోడ్ నుంచి మధ్యాహ్నం 1:15 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8:20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకే ఈ రైలును నడుపుతున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.