VDP Associates: అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో జగన్ కు మూడోస్థానం

  • వీడీపీ అసోసియేట్స్ 'దేశ్ కా మూడ్' సర్వే  
  • ప్రథమస్థానంలో ఒడిశా సీఎం
  • కేసీఆర్ కు ఐదోస్థానం
ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు అందుకున్న వైఎస్ జగన్ అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంల జాబితాలో మూడోస్థానంలో నిలిచారు. జాతీయ స్థాయిలో వీడీపీ అసోసియేట్స్ సంస్థ 'దేశ్ కా మూడ్' పేరిట నిర్వహించిన ఓ సర్వేలో 71 శాతం మంది జగన్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వీడీపీ అసోసియేట్స్ 'దేశ్ కా మూడ్' పేరిట ఈ సర్వే చేపట్టింది. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు కాన్సెప్ట్ పట్ల అత్యధికులు హర్షం వ్యక్తం చేసినట్టు వీడీపీ సర్వేలో వెల్లడైంది. కాగా, ఈ మోస్ట్ పాప్యులర్ సీఎంల జాబితాలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నంబర్ వన్ గా నిలిచారు. రెండో స్థానంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉండగా, తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఐదో స్థానం దక్కింది.

VDP Associates
Desh Ka Mood
Jagan
KCR
Odisha

More Telugu News