Amaravathi: దేవుడు రాసిన స్క్రిప్ట్ అదిరింది... ఎవరైతే భ్రమరావతి అన్నారో వాళ్లతోనే అమరావతిని అందంగా చూపిస్తున్నాడు: చంద్రబాబు చురక

  • అమరావతిని అందంగా ముస్తాబు చేసిన ఏపీ సర్కారు
  • ఆశ్చర్యం వ్యక్తం చేసిన చంద్రబాబు
  • గతంలో అమరావతిని గ్రాఫిక్స్ మయం అని విమర్శించినవారిపై ట్వీట్
రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రస్తుత ప్రభుత్వం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అమరావతిలోని కీలక భవనాలకు, రహదారులకు త్రివర్ణ పతాక రంగులను వెదజల్లే విద్యుద్దీపాలతో అందంగా అలంకరణ చేశారు. దీనిపై చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు. దేవుడు భలే స్క్రిప్ట్ రాశాడని పేర్కొన్నారు. ఎవరైతే రాజధాని అమరావతిని భ్రమరావతి అని, గ్రాఫిక్స్ మయం అని విమర్శించారో, దేవుడు ఇప్పుడు వాళ్లతోనే అమరావతికి లైటింగ్ వేయించి, అందంగా చూపించేలా చేశాడని వ్యాఖ్యానించారు.
Amaravathi
Chandrababu
Andhra Pradesh

More Telugu News