India: నా ఫ్రెండ్ మోదీ, భారత ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ

  • నమస్తే అంటూ శుభాకాంక్షలు చెప్పిన నెతన్యాహూ
  • భారత్-ఇజ్రాయెల్ బంధం సరికొత్త ఎత్తుకు చేరుకుందని వ్యాఖ్య
  • ట్విట్టర్ లో వీడియోను పోస్ట్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని
భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అనుకోని అతిథి నుంచి శుభాకాంక్షలు అందాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఈరోజు భారత ప్రజలకు, ప్రధాని నరేంద్ర మోదీకి 73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘నా స్నేహితుడు ప్రధాని మోదీకి, భారత ప్రజలకు నమస్తే. మీ అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు’ అని ట్వీట్టర్ లో ఓ వీడియోను నెతన్యాహూ పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్-ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత ఉన్నతస్థితికి చేరుకున్నాయని తెలిపారు. ఇరుదేశాల మధ్య ఉన్నది సహకారం మాత్రమే కాదనీ, నిజమైన స్నేహమని వ్యాఖ్యానించారు.
India
israel
Independence day
wishes
Benjamin Netanyahu
Twitter
video

More Telugu News