India: భారత్ పై అక్కసు.. తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ ను నలుపు రంగులోకి మార్చిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్!

  • ఆర్టికల్ 370ని రద్దు చేసిన భారత్
  • జమ్మూకశ్మీర్ ను రెండు ముక్కలుగా చేస్తూ చట్టం
  • భారత్ చర్యపై మండిపడుతున్న పాక్
జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా, స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి, ఆ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లడఖ్ లుగా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రం విభజించిన సంగతి విదితమే. ఈ నిర్ణయంపై పాకిస్థాన్ తీవ్రంగా మండిపడింది. తమ స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 14ను కశ్మీరీలకు సంఘీభావంగా జరుపుకుంటామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.

భారత స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15ను బ్లాక్ డేగా నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగా తన ట్విట్టర్ ప్రొఫైల్ ఫొటోను నలుపు రంగులోకి మార్చేశారు. కశ్మీర్ కోసం అవసరమైతే ఎందాకైనా వెళతామని ఇటీవల ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ఈ సమస్యను ఐక్యరాజ్యసమితితో పాటు అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తుతామని చెప్పారు.
India
Pakistan
Jammu And Kashmir
imran khan
Twitter
profile pic
changed
into
black colour

More Telugu News